2014లో అధికారం కోసం బాబు మోడీని కలిసి బిజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బిజేపీతో పొత్తు పెట్టుకున్న… ఆయన మేనియా ఆంధ్రాలో పని చేస్తుందో లేదోనని అనుమానంతో.. పవన్ కళ్యాణ్ ను పట్టుకుని తన పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడు. ఇక అధికారం కోసం దాదాపు 500 నుంచి 600 వరకు అలవి కానీ హామీలు ఇచ్చాడు. వాటిలో చంద్రబాబు గెలవడానికి, జగన్ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన హామీ రైతు రుణమాఫీ. దాదాపు 83 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే అది సాధ్యం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు.
అలాగే 30ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుగారికి కూడా తెలుసు. అయినా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే చంద్రబాబు రైతులందరికీ అన్ని స్థాయిల్లో పూర్తిగా రుణ మాఫీ చేస్తానని ప్రకటించాడు. కానీ జగన్ మాత్రం ఫక్తు రాజకీయ వేత్తగా కాకుండా పరిణితి గల ఆర్థిక వేత్తగా ఆలోచించాడు. అసలే విభజనతో ఆర్థికంగా చితికిపోయిన ఏపీ రాష్ట్రంలో రుణ మాఫీ చేయాలంటే కనీసం 40 వేల కోట్లు అవుతుంది..అందుకే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రుణ మాఫీ చేయడం అసాధ్యమని భావించడం..అధికారం కోసం నానా గడ్డి కరిచే చంద్రబాబులాగా మోసపూరిత వాగ్ధానాలు చేసి రైతులను మోసగించలేనని జగన్ భావించాడు. బాబు రుణ మాఫీ హామీతో అధికారం దక్కించుకున్నాడు.
కానీ జగన్ మాత్రం తప్పుడు హామీలు ఇచ్చి రైతులను మోసం చేయలేను అని రుణ మాఫీ గురించి మాట్లాడలేదు. ప్రతిపక్షంలో ఉన్న భాదపడను కానీ.. అధికారం కోసం మోసపూరిత వాగ్ధానాలు చేయాలేనని చెప్పేశాడు. చంద్రబాబు నమ్మి రైతులు ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక బాబు రైతు రుణ మాఫీ ఏ స్థాయిలో చేశాడో రైతులందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు మాటలు విని రుణమాఫీ కిస్తీలు కట్టని రైతులందరి పొలాలు, ఆస్తులు బ్యాంకులు జప్తు చేస్తున్నాయి. దీంతో జగన్ ఎందుకు రుణమాఫీ అసాధ్యం అన్నాడో రైతులకు అర్థమైంది.
అధికారం కోసం ప్రజలను బలి చేయడానికి వెనకాడని నాయకులున్న ఈ రోజుల్లో అధికారం లేకపోయినా బాధలేదు రైతన్నలను మోసం చేయలేనని చెప్పి..ప్రతిపక్షంలో కూర్చున్న నిజమైన ప్రజానాయకుడు జగన్ అని ఇప్పుడు ఏపీ ప్రజలు గుర్తిస్తున్నారు..జగన్ రైతు రుణమాఫీ ఇస్తానని ఆ రోజు చెప్పి ఉంటే 2014లోనే ముఖ్య మంత్రి అయ్యేవారు. మన కడుపు నింపే రైతన్నలను మోసం చేయలేనని చెప్పి ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధపడిన ఏకైక నాయకుడు భారతదేశం మొత్తంలో ఒక్క జగనే అని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నిన్న కేఎస్‌ఆర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రుణమాఫీపై పార్టీలో జరిగిన అంతర్గత చర్చలు, జగన్ స్పందించిన తీరును చెబుతూ అధికారం కోసం దిగజారని జగన్ గొప్పతనం గురించి ప్రశంసించారు. రైతులకు మోసం చేయలేనని చెప్పి అధికారాన్ని దూరం చేసుకున్న జగన్‌కు వైసీపీ ఫ్యాన్సే కాదు.. టీడీపీ ఫ్యాన్స్ కుడా చేతులెత్తి మొక్కడం ఖాయం.