ఇప్పటి వరకు నంద్యాలలో వైసీపీ,టీడీపీ మధ్యే ఉప ఎన్నిక పోరు జరగనుందని అందరూ భావించారు.కాని తల్లికాంగ్రెస్ కూడా పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో త్రిముఖపోరు జరగనుంది.చంద్రబాబు సర్కారుపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఎన్నికే రెఫరెండమ్ అవుతుందనేది రాజకీయ వర్గాల వాదన.
2019 ఎన్నికల్లో దూసుకుపోతామనే పాజిటివ్ ఎనర్జీని పార్టీలో నింపేందుకు రకరకాల వ్యూహాలతో జగన్ ఉన్నారు. మైనారిటీలు, దళితుల్లో వైకాపాకి మంచి పట్టు ఉంది కాబట్టి, తమ గెలుపు ఖాయం అన్నట్టు ధీమాతో ఉన్నారు. ఇక, తెలుగుదేశం కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది.
{loadmodule mod_custom,GA1}
తెలుగుదేశం కూడా సర్వశక్తులూ ఒడ్డుతోంది. భూమా ఫ్యామిలీపై ఉన్న సింపథీ తమని గట్టెక్కిస్తుందనీ, టీడీపీలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు భూమా అఖిల ప్రియ వర్గం సర్వశక్తులూ ఒడ్డుతుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. అయితే, ఇంతవరకూ ద్విముఖం అనుకున్న నంద్యాల ఉప ఎన్నిక.. ఇప్పుడు త్రిముఖం కాబోతోంది.ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరుపున అభ్యర్తిని నిలబెడతామని ఆపార్టీ ఛీప్ రఘువీరారెడ్డి ప్రకటించారు.
2014లో నంద్యాల నుంచీ జూపల్లి రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఆయనకి కేవలం 2,459 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ మధ్య జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రావడం వల్ల మైనారిటీలు, దళితులు వ్యతిరేకించే అవకాశం ఉంది. అలాగని, వారు టీడీపీవైపు కూడా మొగ్గు చూపలేరు కాబట్టి, మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు మొగ్గుతారనేది వారి నమ్మకం.
{loadmodule mod_custom,GA2}
స్తుత పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటే… ఆ పార్టీ సోలోగా సాధించేదేమీ కనిపించడం లేదు. కానీ, ఈ పరిణామం వైకాపాకి ఇబ్బంది పెట్టొచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ చీల్చితే.. అతి వైకాపాకి కాస్త మైనస్సే అవుతుందని చెప్పొచ్చు.పులి,సింహాల మధ్య లేడికూన దూరడం అంత అవసరమా రఘువీరా…..?
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}sL4nrFh894w{/youtube}