Sunday, May 4, 2025
- Advertisement -

వైకాపా నుంచి కొమ్మినేనికి ఊహించని బంపర్ ఆఫర్

- Advertisement -
ysrcp bumper offer to kommineni

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి వైకాపా నుంచి ఎంపీ టికేట్ రాబోతుందా అంటే.. అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు.. వైకాపా కొమ్మినేనికి సూపర్ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఎన్టీవీ నుంచి అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రముఖ సీనియ‌ర్ జ‌ర్నలిస్టు ఇప్పుడు సాక్షి టీవీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే.

సాక్షిలో పనిచేస్తున్నప్పటి నుంచి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొమ్మినేనికి వైకాపా బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కొమ్మినేని సాక్షిలో చేరిన దగ్గర నుంచి పార్టీని ప్రజల్లోకి బాగానే తీసుకెళ్తున్నారని వైకాపా అదినేత కూడా బాగానే ఖుషిగా ఉన్నట్లు తెలుస్తోంది. చానల్ పరంగా పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన కొమ్మినేనికి పార్టీ పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

జర్నలిజంలో ఫీక్ స్టేజ్ లో వున్న కొమ్మినేనికి పార్టీ అధికార ప్రతినిధితో పాటు.. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయిస్తే పలితం ఎలా వుంటుందా అని అలోచిస్తున్నారట. కొమ్మినేనికి సీటిస్తే కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చేందిన ఓట్లు బాగానే పడవచ్చని అంచనా వేస్తున్నారట. మరి ఈ విషయంలో కొమ్మినేని అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -