అల్లు అర్జున్ కు అప్పుడే పోటీ ఇస్తున్న పవన్ కొడుకు..!

ఏప్రిల్ 8.. ఈ రోజు సినిమా పరిశ్రమకు చెందిన ముగ్గురు వారసుల పుట్టిన రోజు. వాళ్ళు ఎవరో కాదు.. అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, అకీరా నందన్. వీరిలో అల్లు అర్జున్ అకీరా విషయానికొస్తే ఇద్దరూ మెగా ఫ్యామిలీ వారసులే. అయితే అల్లు అర్జున క్రేజ్ వేరు. పవన్ కొడుకు అకీరా నందన్ క్రేజ్ వేరు. అకీరా ఇంకా సినిమాల్లోకే రాలేదు. కానీ అప్పుడే అల్లు అర్జున్ కి పోటీ ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో అకీరా కు మంచి క్రేజ్ ఏర్పడుతోంది.

ఈ రోజు వీరి బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అకీరా నందన్ పై పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్ విషెస్ ట్వీట్స్ కు దెబ్బకు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. దేశంలో ప్రస్తుతం ఎన్ని సమస్యలున్నా.. వీరిద్దరి బర్త్ డేలు ట్రెండింగ్ అవ్వడం హాట్ టాపిక్గా మారాయి. బన్నీ ఫ్యాన్స్ రచ్చకు #HappyBirthdayAlluArjun అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయి లో మొదటి స్థానంలో ట్రెండ్ అవ్వగా.. #HBDAkiraNandan ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో ఉంది.

ఇంకా సినీ పరిశ్రమలోకి రాకముందే అల్లు అర్జున్ కి పోటీ ఇస్తున్నాడని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారట. ఈ లెక్కన చూస్తే అకీరాకు ఫాలోయింగ్ ఏ రెంజ్ లో ఉందే అర్దం అవుతోంది. పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అక్కడక్కడా కనిపిస్తేనే ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. అలాంటిది పూర్తిగా వెండితెరపై కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో అకీరా ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.