- Advertisement -

పుష్ప 2…రికార్డులు బ్రేక్!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలై 19 రోజులు గడుస్తున్న పుష్ప 2 వసూళ్ల జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2. అలాగే భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఉన్న రికార్డులను సైతం తుడిపేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో రూ.689.4 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన మూవీగా ఉన్న ప‌ఠాన్ (రూ.543.09 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది.

చ‌రిత్ర పుస్త‌కాల‌ను తిర‌గ‌రాస్తున్న పుష్ప‌-2 చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు యశ్ రాజ్ ఫిల్మ్స్ ట్వీట్ చేయగా దీనిపై స్పందించారు బన్నీ.
పుష్ప‌2 సాధించిన ఈ రికార్డుల‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రాలు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని తాను ఆశిస్తున్నాన‌ని బ‌న్నీ చెప్పారు. బుక్ మై షోలో పుష్ప 2 టికెట్లు 18 మిలియ‌న్ల‌కు పైగా అమ్ముడుపోగా ఇది బుక్ మై షో చరిత్రలోనే రికార్డు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -