Saturday, May 4, 2024
- Advertisement -

బాబు శకం ముగిసినట్టేనా…? పవన్ ను పట్టించుకోవడం లేదా….?

- Advertisement -

ఏపీలో జగన్ సర్కార్ పాలనకు ఏడాది ముగిసింది. ఎన్నికలకు ముందు వైసీపీ చెప్పిన నవరత్నాలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసింది. ఇక ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విషయంలో సక్సెస్ కూడా అయింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమ్మ ఒడి, రైతుల భరోసా, చేనేత కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, లాస్టూడెంట్స్కు నేరుగా ధనసాయం చేయడం వంటి నవరత్న పథకాలు, గ్రామ సచివాలయాల పేరుతో లక్షల మందికి ఉపాధి కల్పించడం వంటివన్నీ ఎన్నో చేశారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే గతవారం రోజుల్లో ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి విశాఖ వరకూ ర్యాండమ్ సర్వే చేశారు. ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖ పట్టణాల్లో కనిపించిన ప్రతి ఒక్కర్ని అడిగి సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం అడిగినవారి సంఖ్య 1707. ఇందులో జగన్ పాలన బాగుందని 1087 (64 శాతం) అని చెప్పగా.. పర్వాలేదు అని 178 (10 శాతం) అన్నారు. ఇక జగన్ పాలన బాగాలేదని 442 ( 26 శాతం) తెలిపారు. ఎక్కువ మంది జగన్ పాలనపై ప్రశంసలు కురిపించడానికి కారణం.. జగన్ పాలనలో.. అవినీతి చాలా తగ్గిపోయింది. మహిళలు దాదాపుగా 95 శాతం జగన్ కే మొగ్గు చూపుతున్నారు. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా అన్నీ సకాలంలో అందడం, ప్రభుత్వంకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఈ కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఆనేవి జగన్ కు అనుకూలాంశాలు అని చెప్పవచ్చు.

ఇక జగన్ కు ప్రతికూలాంశాల విషయంకు వస్తే.. మందుబాబులు మద్యం ధర పెంచారని బాధపడుతున్నారు. అయితే వీళ్లు మద్యం విషయం పక్కన పెడితే మిగిత విషయాల్లో జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇసుక సమస్య కరోనా కారణంగా కొంత ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైన జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. ఇక చంద్రబాబు గురించి ప్రజలు పట్టించుకోవడమే మానేశారు. ఇక పవన్ సినిమాలవైపు చూపు మలపడంతో అతని గురించి కూడా ప్రజలు అసలు పట్టించోవడం లేదని అర్దం అవుతోంది.

జగనన్న చేదోడు పథకం ప్రారంభం.. నేరుగా అకౌంట్లలోకి రూ.10వేలు..!

కేసీఆర్ సంచలన నిర్ణయం : పదో తరగతి విద్యార్థులు పాస్..!

బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడంపై బాలయ్య స్పందన..!

గుండెలు బాదుకునోళ్లు.. సిగ్గుతో బిగుసుకు పోయారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -