- Advertisement -

ఉగ్రవాది మసూద్ అజర్‌కి అదిరే దెబ్బ

- Advertisement -

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యలను భారత్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.

ఇక ఉగ్రదాడిలో జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు భారీ షాక్ తగిలింది. అజార్ కుటుంబానికి చెందిన 10మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారు. ఈ విషయాన్ని మసూద్ అజార్ చెప్పారని బీబీసీ ఊర్దూ నివేదించింది. అజార్, అతని తల్లి సన్నిహితుడు, మరో ఇద్దరు సన్నిహితులు కూడా మరణించారని ఆ ప్రకటనలో పేర్కొంది.

బహవల్‌పూర్‌… అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలో మీటర్ల దూరంలో ,లాహోర్ నుండి 400 కిలో మీటర్లు దూరంలో ఉంది. బహవల్ పూర్ లోని మర్కజ్ సుబాన్ పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహ్మద్ కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -