ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత భీభత్సంగా ఉంది. దాంతో ఏపీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అలానే మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి అధికార వర్గాలను ఆందోళకు గురి చేస్తోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో రికార్డు స్థాయిలో 43 మంది కరోనా కారణంగా చనిపోయారు.
ఒక్క రోజులో ఇంత మంది మరణంచడం ఇదే ప్రథమం. అనంతపురం జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 408కి పెరిగింది. అటు, రాష్ట్రవ్యాప్తంగా మరో 1,916 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మొత్తమ్మీద పాజిటివ్ కేసుల సంఖ్య 33,019కి పెరిగింది. తాజాగా, 952 మందిని డిశ్చార్జి చేశారు. ఇంకా 15,144 మంది చికిత్స తీసుకుంటున్నారు.
ఎవరికి తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి : వైఎస్ షర్మిల
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్..?