- Advertisement -

రేవంత్ రెడ్డి ‘కుల’రాజకీయం చేస్తున్నాడా..ఎవరి ఉపాయమిది..?

- Advertisement -

ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో కేసీఆర్ ని గట్టిగా విమర్శించేది ఎవరంటే తప్పకుండా రేవంత్ రెడ్డే గుర్తుకు వస్తాడు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు అయినా పార్లమెంట్ లో మాత్రం మల్కాజ్గిరి నియోజక వర్గంలో ఓ రేంజ్ లో గెలుపొంది అధికార ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ లో ఇతర నాయకులూ లేరా ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నాడా ,  ఉంటే ఈ మౌనమేంటి అనేలా రేవంత్ తన గళాన్ని ప్రజలకు వినిపిస్తున్నాడు..అంతర్గత విభేదాలకు పెట్టిన పార్టీ అయినా కాంగ్రెస్ లో సీనియర్ లతో రేవంత్ రెడ్డి కి పొసగట్లేదు అని బహిరంగంగా తెలిసిన విషయమే..

దానివల్ల రేవంత్ కొంత వెనక్కి తగ్గాల్సి వస్తుంది అని చెప్పొచ్చు.. ఇక రేవంత్ మొదట తెరాస నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తే.. ఆ తర్వాత టీడీపీ లో కీలకంగా ఎదిగారు. చంద్రబాబు కు తెలంగాణ లో నమ్మిన బంటు అయినా రేవంత్ ఓటుకు నోరు కేసులో ఓ వెలుగు వెలిగారని చెప్పారు.. ఆ కేసు విషయంలో రేవంత్ కి జరిగిన చెడుకంటే మంచే ఎక్కువ అని చెప్పాలి.. దాంతో నే సామాన్య ప్రజలకు చాల దగ్గరయ్యాడు.. ఇక ఆ తర్వాత టీడీపీ తెలంగాణ లో బలంగా లేదని చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్లారు.. అప్పటినుండి తెరాస పై విమర్శల వర్థం కురిపిస్తున్నారు..

అయితే కాంగ్రెస్ లో సీనియర్ ల నుంచి వస్తున్న వత్తిడి తో అయన కొత్త పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి.. ఇది చంద్రబాబు ఉపాయమే అని అంటున్నారు..  తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు బలపడడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో మరొక ప్రాంతీయ పార్టీ టీఆరెస్ కు గట్టి పోటీ ఇస్తుందని చంద్రబాబు సలహాతో రేవంత్ రెడ్డి ఈ పార్టీ ని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే తెలంగాణ లో ని టీడీపీ నేతలందరూ టచ్ లో ఉన్నారని తెలుస్తుంది.. ఇక తన సామజిక వర్గం పై జరుగుతున్న అన్యాయాలను వెల్లడించి వారిని తనవైపు తిప్పుకునేలా చేసుకుంటున్నారట.. ఇక కాంగ్రెస్ లో చాల వరకు రేవంత్ సైన్యం ఉంది కాబట్టి వారు కూడా తనవైపుకు రావడం ఖాయం.. ఈ దెబ్బతో కేసీఆర్ పై యుద్ధం ప్రకటించి తన పార్టీ ని లాంచ్ చేయాలనీ రేవంత్ ఆలోచిస్తున్నాడట.. అన్నీ కుదిరి రేవంత్ పార్టీ పెడితే మాత్రం కేసీఆర్ కి కొత్త చికాకులు మొదలవడం ఖాయం అని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -