Sunday, May 5, 2024
- Advertisement -

అయ్యా..అయ్యన్న గారిని గాలికి వదిలేసినట్లేనా..!!

- Advertisement -

టీడీపీ లో భజన బ్యాచ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డ వ్యక్తి అయిన అయ్యన్న పాత్రుడికి ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనేది అక్షర సత్యం.. టీడీపీ లో చంద్రబాబు కన్నా సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అయన అయ్యన్న అని చెప్పాలి.. పెళ్లికాకముందునుంచే అయన రాజకీయాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా చేశారు.. ఆయన రాజకీయ జీవితంలో దాదాపు 12 మంత్రిత్వ శాఖలకు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది..

అలాంటి అయ్యన్నకు టీడీపీ లో ఇప్పటివరకు ఓ ఉన్నతమైన స్థానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఆయన పార్టీ లు మార్చే రాకమా అంటే అదీ కాదు పార్టీ లోకి అడుగుపెట్టిన నాటినుండి అటు ఇటు చూడకుండా, పార్టీ అధికారంలోఉందా లేదా అనేది చూడకుండా టీడీపీ అభివృద్ధికి, చంద్రబాబు కు అండగా ఉన్నాడే తప్పా ఈనాడు తప్పుగా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు.. అలాంటి నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఏమాత్రం గౌరవం ఇచ్చాడని ఇప్పుడు అయ్యన్న సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు.

బీసీ లకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ టీడీపీ పార్టీ అని అయన చెప్పుకుంటారు.. అలాంటి బీసీ నేత అయిన అయ్యన్న  కు తన ప్రభుత్వ హయాంలో కనీసం ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా టీడీపీ ప్రెసిండెంట్ పదవి ఇస్తారా అని చూస్తే అది కాస్త జైలుకి వెళ్లొచ్చిన ఓ అవినీతి పరుడికి ఇవ్వడం వారిని నిరాశ కలిగిస్తుందట.. గతంలో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన కళా వెంకట్రావ్ కి అధ్యక్షా పదవి ఇవ్వడంతో అయ్యన్న సన్నిహితులు అసహనాన్ని వెల్లడించగా ఇప్పుడు అయినా తమ నాయకుడి పేరును పరిశీలించకపోతారా అని చూస్తుంటే అచ్చెన్నా పేరు ను బహిరంగంగా చెప్పడం తో మరింత అసహనంగా ఉన్నారట.. మరి పార్టీ కోసం అయ్యన్న ఏం చేయలేదా అంటే పొద్దున్న లేస్తే జగన్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు.. అలాంటి తమ నాయకుడి ని చంద్రబాబు పట్టించుకోక పోవడం వారికి కొంత  నిరాశ కలిగిస్తుందట.. ఈ నిరాశ లో అయ్యన్న ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -