Thursday, May 9, 2024
- Advertisement -

రాజధాని మర్చారానికి ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..?

- Advertisement -

రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తీసుకున్న ఓ సంచలనాత్మక నిర్ణయం రాజధాని మార్పు.. అమరావతి నుంచి అయన విశాఖ కి రాజధానిని తరలించడం పెద్ద సంచలనమే అని చెప్పాలి.  కేంద్రంలోని పెద్దలను రాష్ట్రంలోని ప్రజలను ఒప్పించి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో తెలీదు కానీ జగన్ అయితే పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.. అయితే ఇప్పటికి అయితే ఈ రాజధాని మార్పు పెండింగ్ లో ఉందని చెప్పాలి.. అప్పట్లో రేపో మాపో షిఫ్టింగ్ మొదలవుతుందని చెప్పినా ఎందుకు అది ఆగిపోయింది.. తాజాగా జగన్ మళ్ళీ రాజధానికి అంతా షిఫ్ట్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారని చెప్పొచ్చు..

విశాఖకు రాజధాని తరలివచ్చేందుకు ఒక శుభముహూర్తాన్ని పండితులు నిర్ణయించారని ప్రచారం అయితే ఉంది. విశాఖ స్వామీజీయే ఆ ముహూర్తం పెట్టారని కూడా అంటూ వచ్చారు. ఇపుడు అంతటి బలమైన ముహూర్తం జగన్ ని విశాఖకు రప్పిస్తోందని కూడా అంటున్నారు. విశాఖలోని ప్రభుత్వ భూమిలో దాదాపుగా 150 కోట్లతో జగన్ సచివాలయానికి శంఖుస్థాపన చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. భీమిలీలోని కాపులుప్పాడ వద్ద సచివాలయం వస్తుందని కూడా అంటున్నారు. విజయాలకు ప్రతీక అయిన దసరా రోజున దీనికి శ్రీకారం చుట్టేయాలన్న ఆతృత ఇపుడు వైసీపీ పెద్దల్లో ఉందని టాక్.

ఇక జగన్ విశాఖ లో ఉండేందుకు కొంత వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు.. నిజానికి విశాఖ లో అన్ని రెడీ అవడానికి కొంత సమయం పడుతుంది.. ఈలోగా రాష్ట్రంలోని వేరే చోట ఉంది పరిపాలన కొనసాగించాలని అయన అనుకుంటున్నారట.. సచివాలయం తయారు కావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా తాత్కాలిక భవనాలలోకి సచివాలయాన్ని తరలించాలని కూడా మరో ప్రతిపాదన అయితే జగన్ సర్కార్ నుంచి వస్తోందిట. దాని కోసం తెర వెనక కసరత్తు జరుగుతోందని అంటున్నారు. అంటే విజయదశమి తరువాత పాలన అన్నది విశాఖ నుంచే మొదలుపెట్టాలని జగన్ కచ్చితమైన అంచనాతో ఉన్నారని చెబుతున్నారు. 

రాజు గారు ఇప్పుడెలా మరీ…!

జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇంత పెద్ద స్టాటజీ ఉందా..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

అనవసరపు అరుపులు ఎందుకు చంద్రబాబు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -