Thursday, March 28, 2024
- Advertisement -

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

- Advertisement -

రాజకీయంలో ఎంతో నేర్పు ఉండాలి.. ఓర్పు ఒక్కటే ఉంటే రాజకీయాల్లో ఎవరు సరిగ్గా రాణించలేరు.. అందుకే రాజకీయాల్లో రాణించాలంటే అందరివల్ల కాదు.. రాజకీయాల్లో తలపండిన వాళ్ళను రాజకీయ చాణిక్యులు అంటారు.. తలపండడం అంటే వయసైపోయిన వారని కాదు రాజకీయం బాగా వంట పట్టించుకున్నవారు అని అర్థం.. అయితే ఇలాంటి వాళ్లలో ఇప్పటివరకు మనం చంద్రబాబు నే ఎక్కువ చూసాం.. కానీ ఇప్పుడు జగన్ కూడా చాణక్య శిష్యరికం చేస్తున్నారని అర్థమవుతుంది.. గతంలో ఎప్పుడు లేనంతగా అయన ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేస్తున్నారు..

సూటిగా పోతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దానివల్ల పెద్దగా ఒరిగేదేమి లేదని గేర్ మార్చి కొంత దూకుడు పెంచారు.. ఈ విషయాన్నీ మోడీ విషయంలో స్పష్టంగా తన వైఖరి ని తెలియపరిచారు జగన్.. గత కొన్ని రోజులుగా జగన్ కూడా మోడీ భజన చేస్తున్నారు.. అందుకు ఓ కారణం ఉందట.. జగన్ కు చంద్రబాబు నుంచి పెద్ద సమస్య ఉంది.. రాష్ట్రంలో ఎం చేద్దామన్నా సీనియర్ ని అంటూ పొలోమని వచ్చి గెలుకుతున్నాడు.. అందుకే మోడీ తో పొత్తు పెట్టుకుంటే టీడీపీ దుకాణం బంద్ చేయించవచ్చు.. అలాగే బీజేపీ నేతలు కూడా ఇటీవలే తనపై చేస్తున్న ఆరోపణలను చూస్తూనే ఉన్నారు జగన్.. వాళ్ళ నోళ్లు మూయించాలంటే సెంట్రల్ లోని మోడీ తో చేతులు కలపాల్సిందే అనుకున్నారు జగన్..

అలాగే ఏ బీజేపీ అండ చూసుకుని పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి పడుతున్నాడా ఆ బీజేపీ తో చేతులు కలిపితే పవన్ నోరు కూడా మూయించవచ్చనని జగన్ ఒకే దెబ్బకు మూడు దెబ్బలు సూత్రాన్ని పాటిస్తున్నారు.. ఏపీలో 2024 నాటికి టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీయవచ్చునని, పవన్ని ఏమీ కాకుండా కూడా సైడ్ చేయవచ్చునని జగన్ ఎత్తులు వేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరడం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మైనారిటీలకు ఎలా నచ్చచెప్పాలా అన్నదే జగన్ ముందు ఉన్న పెద్ద సవాల్ ట. దానికి కనుక సమాధానం వెతుక్కుంటే జగన్ దెబ్బకు ఏపీలో విపక్షం అబ్బా అనకతప్పదట.

జగన్ కు మోడీ అపాయింట్‍మెంట్ ఎందుకు ఇచ్చారు ?

కేంద్ర క్యాబినేట్ లోకి వైసీపీ..?

మరోసారి వారికి చంద్రబాబు తన స్టైల్ లో వెన్నుపోటు..?

జగన్ కొత్త కాబినెట్ లో పదిమంది కొత్తవారిని తీసుకుంటాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -