Sunday, May 19, 2024
- Advertisement -

తప్పిదం..అండర్​ వరల్డ్​ డాన్లు ఫోటోలతో పోస్టల్​ స్టాంప్​లు..!

- Advertisement -

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పూర్​లోని ఓ తపాలా కార్యాలయంలో పెద్ద పొరపాటు జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా… ఏకంగా అండర్​ వరల్డ్​ డాన్లు చోటా రాజన్​, మున్నా భజ్​రంగీ ఫొటోలున్న పోస్టల్​ స్టాంప్​లు ముద్రితమయ్యాయి.

కేంద్రం అమలు చేసిన ‘మై స్టాంప్’ పథకం ద్వారా ఇండియా పోస్ట్ కొందరికి వ్యక్తిగత పోస్టల్​ స్టాంప్​లు అందిస్తుంది. ఇలా ఓ వ్యక్తి… అండర్ వరల్డ్​ డాన్ చోటా రాజన్​, గ్యాంగ్​స్టర్​ మున్నా ఫోటోలతో మొత్తం 24 స్టాంపులు తయారు చేయించుకున్నాడు. వీటిని అచ్చు వేసినందుకు పోస్టు ఆఫీసుకు రూ. 600 చెల్లించాడు.

ఈ ఘటనపై స్పందించిన కాన్పూర్​ పోస్టు మాస్టర్ జనరల్ వినోద్​ కుమార్​ వర్మ… అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిని త్వరలోనే కనిపెడతామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -