కుప్పకూలిన వాయుసేన హెలికాఫ్టర్.. ఏడుగురు మృతి..!

ఫిలిప్పీన్స్​లో వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్ కూలి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్​లోని బుకిడ్నన్​ ప్రావిన్స్​ ఇంపాసుగోంగ్​ ప్రాంతంలో జరిగింది.

ఇంజిన్​ సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సైనిక ప్రతినిధి మేజర్ రుడోల్ఫ్​ కోర్డిరో వెల్లడించారు. హెలికాఫ్టర్​ను అదుపు చేసే క్రమంలో సమీప కొండ ప్రాంతంలో కూలిందన్నారు.

ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.