పవర్ స్టార్.. అనే ఒక్క మాట చాలు యువత, సినీ ఇండస్ట్రీ కెవ్వుమని కేక వేస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు యువతలో కొత్త ఊపు వస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఆయన ఎంత గొప్ప యాక్టరో అంతకు మించి మంచి మనసున్న వ్యాక్తి కూడా.. అలాంటి ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో.. ఆ సినిమాకు కావలసినట్లుగా పాత్రలో ఒదిగిపోవడానికి అంతే శ్రమిస్తారు.
అలాంటి ఘటనే అప్పట్లో ఒకటి జరిగింది. ఆయన తీసిన సుస్వాగతం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నేటికి ఆ సినిమా ఎంతో మంది ఫేవరెట్ చిత్రం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన దేవయాని నటించారు. ఈ చిత్రంలో పవన్ ప్రేయసి కోసం తపన పడుతూ ఇటు తండ్రి ప్రేమను పొందుతూ ఎంతో అద్భుతంగా నటించాడు. 1998 లో విడుదలైన ఈ మూవీ ఇక సంచలనాన్నే సృష్టించిందని చెప్పాలి.
ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తి కర విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తన తండ్రి చనిపోయారని తెలుసుకుని వచ్చి, సమాధి దగ్గర ఏడ్చే సన్నివేశం ఎంతో స్పెషల్. ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉన్నాడంట. దీంతో ఆ ఏడ్చే ఈ సీన్ అద్భుతంగా వచ్చిందంట.దీనికోసం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాక్టీస్ చేశారని ఆ సినీ యూనిట్ చెబుతోంది.