Tuesday, April 30, 2024
- Advertisement -

విజయ్ సేతుపతి అందుకే పుష్ప నుంచి తప్పుకున్నాడట!

- Advertisement -

కోలీవుడ్ లో మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్న నటుడు విజయ్ సేతుపతి. టాలీవుడ్ లో అయితే అతని రేంజ్ మామూలుగా లేదు.

ఉప్పెన ఈవెంట్ లోనే అతనికున్న క్రేజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. అయితే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో మొదట నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడిన దాని బట్టి అర్ధమయ్యింది. మెగాస్టార్ నుంచే కాకుండా సుకుమార్ నుంచి కూడా అతనికి ఫోన్ కాల్స్ వెళ్లాయి.

సుకుమార్ అయితే మీరు చేయాల్సిందే అని పట్టుబట్టిన తరువాత సేతుపతి కథ విని ఫిదా అయ్యాడు. అయితే పుష్ప కోసం కూడా అతన్ని సెలెక్ట్ చేసుకోగా డేట్స్ కారణంగా సినిమాని సినిమాని వదులుకున్నాడట..ఇక ఇటీవల విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా తన విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -