Saturday, May 4, 2024
- Advertisement -

మళ్ళీ ఆ యువ దర్శకునితో సినిమా చెయ్యబోతున్న సూపర్ స్టార్!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి మళ్ళీ ఎప్పటిలానే వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. మొత్తానికి రాజకీయాల్లోకి రాబోతున్న ఆలోచనలకి సూపర్ స్టార్ ఇక గుడ్ బయ్ చెప్పి ముగింపు పలికారు . అయితే షూటింగ్స్ ఊపండుకుంటున్న సమయంలో తలైవా వీలైనంత త్వరగా మరికొన్ని సినిమాలను సెట్స్ పైకి తీసుకు రావాలని అనుకుంటున్నాడు.

ఏడు పదుల వయసులోకి వచ్చిన తలైవా మరో ఐదేళ్ల వరకు వీలైనన్ని సినిమాలను చాలా వేగంగా విడుదల చేయాలని అనుకుంటున్నాడు.తరువాత శివ దర్శకత్వంలో అన్నత్తే అనే సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది అగ్ర దర్శకులు కథలు చెబుతున్నా కూడా మళ్లీ సూపర్ స్టార్ ఫోకస్ యువ దర్శకులపైనే ఉన్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ మరోసారి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇదివరకే వీరి కాంబినేషన్ లో పేట అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో అయితే క్లిక్కవ్వలేదు.ఇక మరోసారి ఆ దర్శకుడితోనే మాస్ కమర్షియల్ సినిమాను చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అలాగే సీనియర్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ తో కూడా రజినీకాంత్ ఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -