రావు రమేష్, పవన్ కు మధ్య గొడవ

rao ramesh stable show on this hero

పవన్ తో రావు రామేష్ కు గొడవ ఎందుకు అనుకుంటున్నారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న విల‌న్ల‌లో ప్ర‌కాష్‌రాజ్ త‌ర్వాత ఆయ‌నకు పోటీ ఇచ్చే విల‌క్ష‌ణ‌మైన విల‌న్ ఎవ‌రంటే అందరి ముందుగా చెప్పేది.. రావు ర‌మేష్‌ పేరే. విల‌నిజానికే తెలుగులో హిస్ట‌రీ క్రియేట్ చేసిన రావు గోపాల‌రావు న‌ట వార‌సుడిగా పరిచయం అయిన రావు ర‌మేష్.. ఇటు విలన్‌గా , అటు తండ్రిగా విభిన్న పాత్రలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడే అనిపించుకుంటున్నాడు.

ఇటివలే రావు ర‌మేష్ ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లోనూ ఆయన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ నెపథ్యంలోనే ఆయన ఓ ఇంట‌ర్వ్యూలో న‌ట‌న‌లో త‌న తండ్రిని అనుక‌రించాల‌ని తాను ఎప్పుడూ అనుకోలేద‌ని… తనకు నచ్చినట్లే నటనతో ఆకట్టుకుంటానని చెప్పారు. ఇక పవన్ నటించిన సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేది చిత్రంలో ప‌వ‌న్‌కు మామ‌గా నటించాని.. ఇప్పుడు పవన్ కొత్త సినిమా కాట‌మ‌రాయుడులో తాను విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ చిత్రంలో తాను రాయ‌ల‌సీమ యాస‌లో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటానని ఆయన తెలిపారు. విలన్‌ అంటే… కొట్టడం, అరవడం మాత్రమే కాదని అందులో అనేక కోణాలు దాగి ఉంటాని… అన్ని కోణాల్లోనూ విలనిజాన్ని చూపించాలని రావు ర‌మేష్‌ తెలిపారు. సో ఇప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీద రావు ర‌మేష్ విల‌నిజం చూపిస్తాడన్నమాట.

Related

  1. నడిసొచ్చే నర్తన శౌరి.. పవన్ న్యూ ఇయ‌ర్ కానుక‌
  2. పవన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరు!
  3. పవన్ సరసన యాంకర్ అనసూయ!
  4. పవన్ కళ్యాణ్ కి మామగా సూపర్ స్టార్..?