నటి, మోడల్ పార్వతీ నాయర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందం ఎంత ఉన్నా అది సోషల్ మీడియాలో పెట్టకపోతే కొందరికి నిదురపట్టదు. ఎంత అందం ఉన్నా అది పడాల్సిన వారి దృష్టిలో పడితేనే కదా.. దాని విలువ అందుకే దర్శక, నిర్మాతలకు తెలిస్తే కదా అవకాశాలొచ్చేది అనుకుంటారో ఏమో కానీ కొందరు సోషల్ మీడియా ఆయుధంగా బాగా పాపులర్ అయిపోతుంటారు.
తమ హాట్ లుక్స్ ఫోటోలు, వీడియోలు తీసుకొని సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తుంటారు. ఆ కోవలోకే వస్తుంది పార్వతీ నాయర్. సాధారణ తెలుగు ప్రేక్షకులకు పార్వతీ పెద్దగా తెలియదు కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగానే తెలుసు. అలానే మలయాళ, తమిళ ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం పార్వతీ నాయర్. తాజాగా ఈ అమ్మడు మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది.
ఈ మద్య పార్వతీ నాయర్ కూడా ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. తాజాగా జిమ్ ట్రైనర్ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్ స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మైఖేల్‌తో కలిసి ఓ వీడియో తీస్తుండగా, అతను సడెన్‌గా పార్వతిని గాల్లోకి పైకెత్తాడు. దీంతో షాక్ అయిన నటి..ఇది సడెన్ సర్ప్రైజ్ అంటూ ఆ వీడియోను షేర్ చేసింది.