- Advertisement -

‘గుంటురోడు’ మూవీ రివ్యూ!

- Advertisement -
Gunturodu Movie Review

టాలీవుడ్ హీరోలల్లో ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ ఒకరు. ‘బిందాస్’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు  ‘గుంటూరోడు’ అనే సినిమా తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘లవ్‌లో పడ్డాడు’ అనేది ఈ మూవీకి ఉప శీర్షిక.  ఎస్.కె.సత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ: 

తండ్రి సూర్యనారాయణ(రాజేంద్రప్రసాద్).. తన కొడుకు కన్నా(మంచు మనోజ్)ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కన్నా ఎవరితో గొడవ పడిన తండ్రి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అయితే అన్యాయం జరిగితే కన్నా సహించలేడు. అమృత(ప్రగ్యాజైస్వాల్) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. అమృత క్రిమినల్ లాయర్ శేషు(సంపత్) చెల్లెలు. శేషుకి కోపం ఎక్కువ.. లాయర్ స్థానం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవిలో ఉండాలనే ప్రయత్నంలో శేషు ఉంటాడు. అదే టైంలో శేషుని.. ఓ కారణం చేత కన్నా కొడతాడు. తనని కొట్టింది కన్నా అనే విషయం శేషుకి తెలియకపోవడంతో ఎలా అయినా అతన్ని చంపి తీరాలనే కసితో గుంటూరు మొత్తం తన మనుషులతో గాలిస్తాడు. మరి శేషు.. కన్నాని ఎలా పట్టుకున్నాడు..? శేషును కన్నా ఎందుకు కొట్టాడు..? కన్నా తను ప్రేమించిన అమ్మాయిని గెలుచుకోగలిగాడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ముఖ్యంగా మనోజ్ నటన గురించి. హీరోగా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. కంచె సినిమా తరువాత ప్రగ్య పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఈ సినిమాలో కనిపించింది. ప్రగ్యాను గ్లామరస్‌గా అందరినీ ఆకట్టుకుంది. నటన పరంగా ఓకే అనిపించింది. సంపత్ తన పాత్రకు న్యాయం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ కూడా హీరో తండ్రిగా మెప్పించాడు. ఈ సినిమా ఎక్కువ శాతం ఈ నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సెకండ్ ఆఫ్ తో చూస్తే.. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది. 

సినిమాటోగ్రఫీ వర్క్ గురించి ఎంత చెప్పిన తక్కువే… అద్బుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. వసంత్ మూజీక్ బాగుంది. 

మైనస్ పాయింట్స్ : 

ఈ మూవీలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కథ గురించి. అసలు ఈ సినిమాలో కొత్త కథ ఏమి లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగే ఈ సినిమా నడిచింది. తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో, విలన్‌ను ఎదుర్కోవడం.. హీరో అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోవడం అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి. సినిమా మొదటి భాగం బానే ఉన్న సెకండ్ ఆఫ్ విసిగు తెప్పించింది. అరుస్తూ రొటీన్ డైలాగ్స్ పలకడాలు.. ఒక్క ఫ్రేమ్‌లో కూడా కొత్తదనం లేదు. కానీ అస్తమాను పాటలు రావడం బోర్ గా అనిపిస్తోంది. ఆడియన్స్‌కు సినిమా కనెక్ట్ కాకపోవడంతో మనోజ్ కష్టం మొత్తం బూడిద పాలైనట్లుంది. ఇక దర్శకుడు తన దర్శకత్వంలో కొత్తదేమి చూపించలేకపోయాడు. 

మొత్తంగా :

సరైన కథ లేకపోవడం ఈ సినిమా మైనస్ పాయింట్.. హీరో, హీరోయిన్, ఇతర నటినటులు బానే చేసిన.. కథలో దమ్ము లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. సెకండ్ హాఫ్‌లో కథను మరింత సాగదీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బి, సి సెంటర్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా వాళ్లకు నచ్చవచ్చు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -