Friday, May 17, 2024
- Advertisement -

ద్వారక మూవీ రివ్యూ

- Advertisement -
Dwaraka Movie Review

లాజిక్స్  కంటే మ్యాజిక్స్ నే ఎక్కువ నమ్ముతారు.. అందుకే మన దేశంలో బాబాలు ఫేమస్ అని జులాయి సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ గుర్తింది కదూ. సరిగ్గా ఈ పాయింట్ నే బేస్ చేసుకుని సినిమా చేశాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ద్వారక.

ఈ సినిమాలో దొంగబాబాగా మేజిక్కులు చేస్తుంటాడు. శ్రీనివాస్‌ రవీంద్ర  దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెనుబోతు నిర్మాతలుగా వ్యవహరించారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన  ఈ దొంగబాబా తన మేజిక్ తో ప్రేక్షకుల్ని కూడా మెప్పించగలిగాడా… పెళ్లి చూపులు సినిమా తరహా సెన్సేషన్ ని మరోసారి క్రియేట్ చేశాడో లేదో తెలుసుకుందాం.

కధలోకి వెళ్తె…

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఎర్రశీనుగా నటించాడు.

ఎర్రశీను స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఓ రోజు స్థానికులు వెంబడించడంతో ద్వారక అనే అపార్ట్‌ మెంట్‌ లో తలదాచుకుంటాడు.  అక్కడ అనూహ్య సంఘటనలతో   ఎర్రశీను  బాబాగా మారతాడు. తనకొచ్చిన చిన్నచిన్న మ్యాజిక్స్ తో జనాల్ని బుట్టలో వేస్తాడు. తక్కువ సమయంలోనే చాలా  పాపులర్‌ అయిపోతాడు. ఈ బాబా అవతారాన్ని ఇలానే కంటిన్యూ చేసి కోట్లకు పడగెత్తాలనుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ బాబాకి పూజా అనే అమ్మాయితో  పరిచయం అవుతుంది.  అది ప్రేమగా మారుతుంది. మరోపక్క ఈ బాబాను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన రూ.2వేల కోట్లను కొట్టేయాలని  ఒక ముఠా ప్రయత్నిస్తుంటుంది. అలానే ఎర్రశీను  బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు వస్తాడు. అన్ని వైపుల నుండి సమస్యలు చుట్టుముట్టే సరికి ఎర్రశీను ఇబ్బందుల్లో పడతాడు. ఈ సమస్యల  నుండి  ఎర్రశీను ఎలా బయటపడ్డాడు. బాబా నాటకానికి ఎలా తెరదించాడు అనే ఆసక్తికర అంశాలు తెలుసుకోవానుకుంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.

కధనం ఏంటంటే..

కధ పాతదే అయినా కథనం కొత్తది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, రొమాంటిక్ ట్రాక్ లతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ షాకింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ ధ్రిల్లింగ్ గా ఉన్నా కాస్త స్లో గా అనిపిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే…

దొంగగా, దొంగబాబాగా నటనలో .. రెండు వేరియేషన్స్ చూపించగలిగాడు విజయ దేవరకొండ. కామెడీ కూడా పండించగలిగాడు. పూజా జవేరి గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితమయ్యింది. పృధ్వీ తెరమీద నవ్వుల పువ్వులు పూయించాడు. ప్రకాశ్‌రాజ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా ఆ పాత్ర  కథలో కీ రోల్ ప్లే చేసింది. దర్శకుడు పాత కధనే ఎంచుకున్నా ట్రీట్ మెంట్ తో నడిపించగలిగాడు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు ఇంకాస్త బాగుండాల్సింది. ఓవరాల్ గా ద్వారక ఓకే అనిపించుకుందన్న టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -