సింగర్ సునీత సినిమా ఎంట్రీ చాలా సంవత్సరాలుగా చర్చలో ఉన్న అంశం. అందంగా ఉన్న ఈ గాయనీమణి సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో మంది కోరుకొంటున్నారు. మధురమైన గానంతో పాటు ఆమె తెరపై కూడా కనిపించి అలరిస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుకొంటున్నారు.
అందుకు తగ్గట్టుగా అనేక రూమర్లు కూడా వచ్చాయి. ఆమె నటించబోవడం గురించి వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు!
ఆ మధ్య శేఖర్ కమ్ముల దర్వకత్వంలో వచ్చిన ‘అనామిక’ సినిమా విషయంలో మాత్రం కొంత వరకూ ఆ రూమర్లు నిజం అయ్యాయి. ఆ సినిమా ప్రచార ట్రైలర్ లో సునీత కనిపించింది. దీంతో సినిమాలో కూడా నటించిందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ సినిమాలో సునీత నటించలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన రూమర్ వచ్చింది. సునీత ఒక తెలుగు సినిమాలో నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందబోయే ఒక సినిమాలో సునీత నటిస్తుందని.. అందులో సునీతది పవన్ కు అత్తగారి రోల్ అని అంటున్నారు. మరి ఇది కూడా ఒట్టి రూమర్ గానే మిగిలిపోతుందో లేక.. నిజంగానే సునీత పవర్ స్టార్ సినిమాలో తెరపైకి వస్తుందో చూడాలి!