సభలో నిన్న, ఇవాళ అజెండా పూర్తి చేయలేకపోయామని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. సభలో అన్ని పక్షాలు సహకరిస్తే సభ సజావుగా నడపడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్షం అంటే విమర్శలే కాదు, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వవచ్చునన్నారు. ఈరోజు సభ వాయిదాపడిన తర్వాత సభ్యుల మధ్య అవాంఛనీయ ఘటన జరిగినట్టు తెలిసిందన్నారు. సభా మర్యాదలకు భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.