Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ బడ్జెట్ రూ.1,11,824 కోట్లు

- Advertisement -

ఏపీ అసెంబ్లీ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2013-14 బడ్జెట్ ను మొదటి సారిగా ప్రవేశ పెట్టారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ రూ.1,11,824 కోట్లతో ప్రవేశ పెడుతున్నామన్నారు.

ప్రణాళిక వ్యయం 85,151 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 26, 673 కోట్లు, ద్రవ్యలోటు 19,028కోట్లు, రెవెన్యూ లోటు 6 వేల కోట్లు, ప్రభుత్వ ఆదాయం రూ. 38 వేల కోట్లు, ఆర్థిక లోటు 12 వేల కోట్లని ఆయన పేర్కొన్నారు.
వికలాంగ సంక్షేమ, వృద్ధులకు రూ. 65 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ. 371 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ. 2655 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 1150 కోట్లు, యువజన శాఖకు 126 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ. 7 వేల కోట్లు, సాగు నీటికి రూ. 8,465 కోట్లు,  గ్రామీణాభివృద్ధికి రూ. 6094 కోట్లు, పంచాయతీ రాజ్ రూ. 4260 కోట్లు, మౌలిక వసతులకు రూ. 73 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ. 2612 కోట్లు,  విపత్తుల నిర్వహణకు రూ. 403 కోట్లు గా కేటాయించారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -