- Advertisement -

నటుడు వినోద్ ఖన్నా మృతి

- Advertisement -
Actor Vinod Khanna passes away at 70

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా మృతి చెందారు. 70 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..

అయితే గతంలో వినోద్ ఖన్నా క్యాన్సర్ తో బాదపుడుతున్నారన్న వార్తలు వినిపించినా కుటుంబ సభ్యులు ఆ వార్తలను ఖండించారు. ఆయన డీ హైడ్రేషన్ కారణంగానే ఆసుపత్రిలో చెరినట్టుగా తెలిపారు

1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం బాలీవుడ్‌లో అప్రతిహాతంగా కొనసాగింది. 2015 వరకు దాదాపు 140 చిత్రాల్లో ఆయన నటించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా దిల్‌వాలే చిత్రంలో కన్పించారు.
రాజ‌కీయ ప్ర‌స్తానం చూసుకుంటే బీజేపీ నుంచి రెండు సార్లు వినోద్‌ ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. వాజ్‌పేయ్ హ‌యాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారాయన. 2009 ఎన్నికల్లో ఓటమి పాలైన వినోద్‌ ఖన్నా, మళ్ళీ 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం గురుదాస్‌ పూర్‌ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వినోద్‌ ఖన్నా మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -