Friday, May 3, 2024
- Advertisement -

2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్

- Advertisement -
YSRCP MLA Anil Kumar Yadav comments on Nara Lokesh

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబ‌లి సినిమా గురించి ఎంత చెప్పుకుంటే అంత త‌క్కువ‌. క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక బాహుబ‌లి సినిమాటైటిల్‌ను రాజ‌కీయాలకు వాడేస్తున్నారు. రాజ‌కీయాల‌ల్లోకూడా బాహుబ‌లి పీవ‌ర్ ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పుకోవాలి.

కొన్ని రోజుల క్రితం తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ఒక బాహుబ‌లి కావాల‌ని అన‌డంతో ఎంత చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. 2019 ఎన్నిక‌ల‌లోపు కాంగ్రెస్‌కు బాహుబ‌లి వ‌స్తాడంటూ జానా రెడ్డి చేసిన వ్యాఖ్య‌లను ఆపార్టీ నాయ‌కులు త‌మ‌కు ఇస్ట‌మొచ్చిన‌ట్లు అన్వ‌యించుకున్నారు.
ఇప్పుడు అదే బాహుబ‌లి పీవ‌ర్ ఏపీ రాజ‌కీయాల‌కు అంటుకుంది.వైఎస్సార్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఏపీ రాజకీయాల్లో బాహుబలి గురించి ప్రస్తావించాడు. ఇక్కడ బాహుబలి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డే అన్నాడు అనిల్. ఐతే అనిల్ ఈ ప్రస్తావన ఊరికే తేలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ తో జగన్ కు పోలిక పెడుతూ.. అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో కూడా అనీల్ టీడీపీమీద‌కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను,పార్టీనీ ఎవ‌రైనా విమ‌ర్శిస్తే నేను ఏపేజీలో ఉంటానోతెలియ‌దు వారు మాత్రం మొద‌టి పేజీలో ఉంటార‌ని చేసిన వ్యాఖ్య‌లు ఎంత సంచ‌ల‌నం క‌లిగించాయే తెలిసిందే.
అనీల్ ఏమీ ఊరికే అన‌లేదు. జ‌గ‌న్‌…లోకేష్‌ల‌ను పోల్చుతూ వ్యాఖ్య‌లు చేశారు.వైఎస్ జగన్.. నారా లోకేష్ మధ్య పోలిక కేవలం ఇద్దరూ ముఖ్యమంత్రుల కొడుకులు అనే విషయంలో మాత్రమే అని.. అది మినహాయిస్తే ఇద్దరికీ అసలు ఎక్కడా పోలికే లేదని అనిల్ కుమార్ అన్నాడు. రాజకీయ పరిణతి విషయంలో జగన్ ముందు లోకేష్ ఎంతమాత్రం నిలవలేడని చెప్పాడు. జగన్ బాహుబలి లాంటి హీరో అయితే.. లోకేష్ బ్రహ్మానందం లాంటి కమెడియన్ అని అభివర్ణించాడు అనిల్. బాహుబలి లాగే జగన్ కూడా విజయం సాధిస్తాడని అన్నాడు. జగన్ ను తర్వాతి ఎన్నికల్లో సీఎంగా చూడటానికి తన లాంటి యువ సైన్యం అండగా నిలవాలని అనిల్ పిలుపునిచ్చాడు.
గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల జగన్ కు.. పార్టీకి మంచే జరిగిందని.. దీని ద్వారా తాము ప్రజల సమస్యలపై మరింత అవగాహన పెంచుకుని.. వాటిని పరిష్కరించడం ఎలాగో బాగా తెలుసుకున్నామని అన్నాడు. రాబోయే ఎన్నికల్లో జగన్ తప్పక గెలిచి సీఎం అవుతాడని.. వైఎస్ ఆశీర్వాదం తమకు తప్పక ఉంటుందని అనిల్ చెప్పాడు. మ‌రి అనీల్ చేసిన ఈ బాహుబ‌లి వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై….బాబు,లోకేష్ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు.
  2. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  3. లోకేష్ నోటి నుంచి మరో అనిముత్యం..
  4. ఇక మార‌వ లోకేష్‌ నీకు దండంపెడ‌తర‌ కొడుకో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -