అఫిషియల్: పవన్ సురేందర్ రెడ్డి కాంబో.. సీక్రెట్ రివిల్ !

Pawan Kalyan Surender Reddy Movie Secret Revealed
Pawan Kalyan Surender Reddy Movie Secret Revealed

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన తరువాత.. వరుసగా నాలుగు సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. వాటిలో భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, భవధియుడు భగత్ సింగ్, వంటి మూవీస్ తో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమీటయ్యారు పవన్. అయితే వాటిలో ఒక్క భీమ్లా నాయక్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరి హర వీరమల్లు ఇంకా సెట్స్ పై ఉండగా, మిగిలిన రెండు ప్రాజెక్ట్ ఇంకా మొదలు కాలేదు. అయితే వాటిలో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఉంటుందా ? ఉండదా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో చాలా రోజుల నుంచి మెదలుతున్నాయి.

ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన ప్రకటన వచ్చి రెండేళ్ళు పూర్తి అయిన ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటనను చిత్రయూనిట్ ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

అయితే పోస్టర్ లో మూవికి సంబంధించిన ఇంటరెస్టింగ్ సీక్రెట్స్ ను కూడా రివిల్ చేశారు. పోస్టర్ లో హైదరబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక గన్ ను హైలెట్ చేస్తూ.. ” యథా కలామ్ తథా వ్యవహారామ్.. ” అని ఆసక్తికరంగా పోస్టర్ డిజైన్ చేశారు. అయితే పోస్టర్ ను బట్టి చూస్తే ఈ మూవీ హైదరబాద్ బ్యాక్ డ్రాప్ లో గ్యాన్ స్టార్ మూవీ లా ఉండే అవకాశం ఉండని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేని తో చేస్తున్న ” ఏజెంట్ ” మూవీ తరువాత పవన్ కల్యాణ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.