Thursday, April 25, 2024
- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్ కు మద్దతుగా మమత.. బీజేపీకి భయపడుతోందా ?

- Advertisement -

దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా మమతా బెనర్జీ కి ప్రత్యేక స్థానం ఉంది. బీజేపీ నేతలపై, నరేంద్ర మోడీ పాలనపై ధీధి చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు అగ్గి రాజేస్తూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని శక్తిగా తృణమూల్ కాంగ్రెస్ నిలపడమే కాకుండా దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వానికి మమతబెనర్జీ కొరక రాని కొయ్యగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం ధీది దేశ రాజకీయాల్లో నిశ్శబ్ధ వైఖరి ప్రదర్శిస్తోంది. మోడీ పాలనపై ఒంటికాలు పై లేచే మమత ప్రస్తుతం ఎందుకు సైలెంట్ గా ఉంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ మద్య దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై వరుసగా ఈడీ దాడులు జరుగుతున్నా సంగతి తెలిసిందే..

ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు కూడా ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక మమత కూడా ఈడీ ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉండని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా కూడా మౌనం పాటిస్తుండడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్లైంది. ఆ మద్య మమతా బెనర్జీ మోడీతో భేటీ కావడం.. ఆ తరువాత నుంచి మోడీ పాలనపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం వంటివి చూస్తుంటే.. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ధీధి బీజేపీ ప్రభుత్వానికి భయపడుతోందనే వాదనలు వస్తున్నాయి. ఇక తాజాగా మమతా బెనర్జీ బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ కు అనుకూలంగా మాట్లాడడంతో ధీదికి నిజంగానే భయం పట్టుకుందా అనే సందేహం రాక మానదు.

ఇంతకీ మమతా ఎమ్మన్నారంటే.. ” ఆర్‌ఎస్‌ఎస్ గతంలో లాగా లేదు..ఆర్‌ఎస్‌ఎస్ చెడ్డ సంస్థ కాదు. అందులో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు. ” అంటూ చాలా వరకు ఆర్‌ఎస్‌ఎస్ కు అనుకూలంగా మమతా వ్యాఖ్యలు చేసింది. అయితే మమతా బెనర్జీ ఈ విధంగా బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ పైన ఇంత పాజిటివ్ గా వ్యాఖ్యలు చేయడం తొలిసారి అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా బీజేపీ పైన ఆర్‌ఎస్‌ఎస్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడే మమతా ప్రస్తుతం ఇంత పాజిటివ్ గా వ్యాఖ్యానిస్తుండడంతో.. మమతా బెనర్జీ ఈడీ కేసులకు బయపడుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read

కే‌సి‌ఆర్ కు ఘోర అవమానం

బాబు చతురత అంటే అదే మరి !

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -