- Advertisement -

ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమం.. అతనికి ఏ పాపం తెలీదు!

- Advertisement -

వైద్య విద్యార్థిని ప్రీతీ హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు నిమ్స్ వైద్యులు. ప్రీతీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్నటితో పోల్చుతే గుండె, కిడ్నీల ఫంక్షనింగ్ కొంత మెరుగుపడిందని తెలిపారు. ప్రీతీ శరీరం ఇప్పుడు చికిత్సకు సహకరిస్తోందని వైద్య బృందం తెలిపింది. తాము ప్రీతీని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. యువతికి ప్రత్యేక డాక్టర్ల బృందంతో చికిత్స అందిస్తోన్నట్లు నిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.

మరోవైపు నిమ్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె.. ప్రీతీకి మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. యువతి త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. వైద్య విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డ సైఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు సైఫ్‌కు మద్దతుగా వరంగల్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన డాక్టర్లు, జూడాలు ఆందోళన చేపట్టారు. సైఫ్‌కు ఎలాంటి పాపం తెలియదని, అమాయకున్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. అతను జూనియర్లను స్టడీలో ప్రోత్సహిస్తాడన్న జూడాలు.. సీనియర్లు సలహాలు, సూచనలు ఇవ్వడం కూడా తప్పా అని ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -