‘దసరా’ వసూళ్ల ధూమ్… దాం…

Nani 'Dasara' 2 Days box office collections
Nani 'Dasara' 2 Days box office collections

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముతిరకణి, సాయి కుమార్, పూర్ణ నటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించారు.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో రిలీజైన తొలి రెండు రోజుల్లోనే రూ. 53 కోట్లకుపైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 38 కోట్లు, రెండో రోజు రూ. 15 కోట్లు… అంటే రెండు రోజుల్లో రూ. 53 కోట్లు వసూలు చేసిందని పత్రికా ప్రకటన పేర్కొంది.