సిల్క్ స్మిత చివరి రోజులు పరిస్థితి దారుణం..?

Silk Smitha’s Last Days Before Her Suicide
Silk Smitha’s Last Days Before Her Suicide

సిల్క్ స్మిత.. ఒకప్పుడు.. తెలుగు, తమిళలో ఓ వెలుగు వెలిగిన భామ. ఈమెకు ఉన్న క్రేజ్ పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా ఉండదు. ఈనాయి తడి అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయలక్ష్మి ఆ సినిమాతోనే ఆమె పేరు సిల్క్ స్మితగా మారింది. ఆమె అందాలతో ఇటు తెలుగు తెలుగులో అటు తమిళంలో ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఎంతో పేరు సంపాదించుకున్న సిల్క్ ఆఖరి రోజుల్లో మాత్రం ఎంతో దుర్బరమైన జీవితం గడిపింది. ఆమె మరణంపై ప్రేక్షుకుల మనసుల్లో తొలుస్తున్నాయి.

సిల్క్ స్మిత తన చివరి రోజుల్లో ఎన్నో కష్టాలను అవమానాలను అనుభవించిందో తెలిస్తే ఎలాంటి వారికైనా కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. సిల్క్ స్మిత ఎంత పాపులర్ అయిందో తనపై అంతే రూమర్స్ కూడా అంతే సంచలనాన్ని సృష్టించాయి. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు సూపర్ స్టార్ కృష్ణతోను ఆమెకు ఎఫ్ఫైర్ ఉన్నట్లు అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి. స్మిత మాత్రం వాటిని పట్టించుకోలేదు. అనుకోకుండా పరిచయమైన ఒక డాక్టర్ కు మనసు ఇచ్చింది సిల్క్. వారిద్దరిలో సహజీవనం చేసినట్లు వార్తలు వస్తే.. వాటి అన్నింటిని కండిస్తూ.. మీము పెళ్లి చేసుకున్నాం అని తెగేసి చెప్పింది. సిల్క్ ఎన్నో సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్న స్మితాని బ్లూ ఫిల్మ్స్ చేయమని ఒత్తిడి చేసారు కొందరు నిర్మతలు.

అందుకు తను నిరాకరించడంతో ఆమె భర్తకు డబ్బు ఆశ చూపి అతని ద్వారా బ్లూ ఫిల్మ్స్ చేయమని బలవంతం చేసారు. కట్టుకున్నవాడే తనను పాడుపని చేయమని బలవంతం చేస్తుంటే తట్టుకోలేక ఓదార్పు కోసం తన సన్నిహితులైన పెద్ద స్టార్స్ కి ఫోన్ చేసింది. వాళ్ళు కూడా తనని పట్టించుకోకపోవడంతో సిల్క్ తీవ్ర మనస్థాపంకు గురైంది. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు తగ్గడం సంపాదించిన డబ్బు అంతా పోగొట్టుకోవడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది.

అయినవారి దగ్గర నుండి ఎటువంటి ఆదరణ లేకపోవడంతో తనలో తాను కుమిలిపోతూ తనకు ఎవ్వరు లేరని నా అనుకున్నావారే నన్ను మోసం చేసారని ఇక తను బ్రతకడం అనవసరం అని లెటర్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన అందం.. నటనతో ఎంతో మందికి వినోదాన్ని పంచిన సిల్క్ జీవితంలో ఆఖరి రోజులు ఎంతో విషాదాన్ని మిగిల్చాయి. సినిమా అనేది అత్భుతమైన రంగుల ప్రపంచం ఎంతో ఇష్టమైన సినీరంగంలో కష్టాలు పడి అవమానాలతో కొందరి స్వార్ధం వల్ల తన జీవితం నాశనం చేసుకున్న సిల్క్ స్మిత లాంటి వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో చూడాలి మరి.