Tuesday, April 30, 2024
- Advertisement -

100 కోట్ల క్లబ్ చేరువులో ‘దసరా’

- Advertisement -

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా సినిమా ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముతిరకణి, సాయి కుమార్, పూర్ణ నటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించారు.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో రిలీజైన తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. నిన్నటితో 6 రోజులైంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల గ్రాస్ .. 53.52 కోట్ల షేర్ ను రాబట్టింది. నాని కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది. 100 కోట్లకి అత్యంత చేరువగా వెళ్లింది. ఈ మార్కును ఈ సినిమా ఈ రోజున టచ్ చేసే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -