చంద్రమోహన్ ఆస్తులు విలువ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.

Actor Chandra Mohan Shocking Assets
Actor Chandra Mohan Shocking Assets

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. జయసుధ, జయప్రధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు.. స్టార్ హీరోయిన్స్ కాకముందు చంద్రమోహన్ సరసన నటించారని ఆయన సరసన నటించిన హీరోయిన్ లు అందరు స్టార్ రేంజ్ వెళ్ళారని సినీ పరిశ్రమ వర్గాలు అంటూ ఉంటాయి. చంద్రమోహన్ ది గోల్డెన్ హ్యాండ్ ని కూడా చెపుతుంటారు.

సిని ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని దశాబ్దాలు పాటు కోన సాగిన చంద్రమోహన్ ఇప్పటికి తనకు అవకాశాలు ఇచ్చే దర్శికులు కోసం ఎదురు చూస్తుంటారట. రియల్ లైఫ్ లో చంద్రమోహన్కు ఇద్దరు కూతుర్లు. సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించిన చంద్రమోహన్.. ఆ తర్వాత భూములపై పెట్టునడులు పెట్టారని.. ఇప్పుడు వాటి విలువ వందల కోట్లు ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అంటూ ఉంటారు.

చెన్నై పరిసరాలలో పలు కాంప్లెక్స్ లతో పాటు హైదరాబాద్ శివారులలోను ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నాయని సమాచారం. ఆయన సింపుల్ గానే ఉంటారు ఆయన గురుంచి చెప్పాలంటే ఆయన జీవితంలో ఎవరికీ దానం చేయలేదు. అలాంటి వాటిల్లో చంద్రమోహన్ పాలు పంచుకోరని చాలా మంది చెబుతుంటారు. తనకు చెప్పకుండా తన రేమ్యునిరేసన్ నుంచి చెన్నై లోని తెలుగు సంగంకు ప్రముఖ నిర్మత రామానాయుడు విరాళం ఇవ్వడంపై ఆయనపై కొన్నేళ్ళపాటు కోపంగా ప్రవర్తించేవారట.