Sunday, April 28, 2024
- Advertisement -

చెమ‌ట దుర్వాస‌న‌తో ఇబ్బందులా.. అయితే ఈజాగ్ర‌త్త‌లు తీసుకోండి

- Advertisement -

వేస‌విలో ప్ర‌తీ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డే స‌మ‌స్య చెమ‌ట స‌మ్య‌. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. ఏదైనా పంక్ష‌న్ల‌కు వెల్లాలంటే భ‌యం. ఎందుకంటే మ‌న నుంచి వ‌చ్చే చెమ‌ట వాస‌న వ‌ల్ల మ‌న‌ల్ను ఎక్క‌డ అవాయిడ్ చేస్తారోన‌ని. చెమ‌ట‌తో కొన్ని సంద‌ర్భాల్లో త‌ల ఎత్తుకోలేన‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు.

అస‌లు చెమ‌ట ఎలా వ‌స్తుందో తెలుసుకుందాం
మనిషి శరీరంలో సుమారు 2 నుంచి 4 మిలియన్ల స్వేద గ్రంథులుంటాయి. ఇవి చర్మం కింద డెర్మిస్ కింది చర్మపొరలో ఉంటాయి. ఈ గ్రంథులు రెండు రకాలు. ఎక్రిన్, ఎపొక్రైన్‌లు. సింఫాథటిక్ నెర్వ్ సిస్టం అదుపులో పనిచేస్తాయి. ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ చెమట రావ‌డం స‌ర్వ‌సాధార‌నం. కొంత మందికి తక్కువగా, మరి కొంత మందికి ఎక్కువగా వస్తుంది. ఇది వారి శ‌రీరాన్ని బ‌ట్టి వ‌స్తూంది. శారీరక శ్రమ చేసేవారికి, ఉదయం నుంచి పొలం పనులు చేసే వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు లేకపోతే ఉక్కపోతతో చెమటలు పట్టేస్తాయి. ఈ చెమటతో పాటు శరీరం నుంచి అమ్మోనియా, ప్రోటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలు బయటకు వచ్చేస్తాయి. దీంతో చెమట ఉప్పగా ఉంటుంది. చెమట రావడంతో చర్మం తడిగా ఉంటుంది. ఎండకు, ఎక్కువ వేడికి చర్మం ఎండిపోకుండా ఉండేందుకు, శరీరం సమతుల స్థితిలో ఉంచేందుకు చెమట వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

చెమ‌ట‌తో బ్యాక్టీరియా క‌ల‌వ‌డం వ‌ల్లే దుర్వాస‌న వ‌స్తూంది.
నిజానికి చెమటకు వాసన ఉండదు. శరీరంపై ఉండే బ్యాక్టీరియా దానితో చేరినప్పుడు విపరీతమైన వాసన పుడుతుంది. చెమట లేదా స్వేదం మ‌నిష‌ఙ‌ చర్మం నుంచి ఉత్పత్తి చేయబడే ఒక రకమైన స్రావం. దీనిలో నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటాయి. స్వేదంలో కొన్ని దుర్వాసన కలిగించే పదార్థాలు, కొద్దిగా యూరియా ఉంటుంది. చెమట రావడం మానవుల్లో ఒక విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం.. ఉష్ణ ప్రదేశాల్లో శరీర వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ చెమట వస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల ఇది ఇంకా ఎక్కువవుతుంది. చెమట కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది. తల, చంకలు, ముఖంలో స్వేద గ్రంథులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రదేశాల్లో చెమట వస్తుంది. ఈ సమస్యను హైపర్ హైడ్రోజిన్ అంటారు. ఇది కొన్ని శరీర భాగాలని వేధిస్తుంది. అరచేతులు, అరికాళ్లకు చెమట ఎక్కువగా ఉంటుంది. చెమట రావడం చెడు ఏమీ కాదు. ఇది శరీరానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. చెమటతో పాటు దుర్గంధం రావడం కాస్త ఇబ్బందికరమే. చెమట ఎండిన తర్వాత అందులోని యూరియా అధికంగా స్రవించడంతో రోగ కారకాలను ఆకర్షిస్తాయి. దీంతోనే దుర్గంధం వస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్ర‌త‌లు
*బాహుమూలాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలు మానేయాలి.
*డియోడరెంట్లకు బదులు యాంటిపెరిస్పెరెంట్ వాడాలి. తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీరు ఎక్కువగా తాగాలి .
*రెండు పూటలా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు డెటాల్, యుడుకోలోన్, రోజ్‌వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి
*స్నానం చేసిన తర్వాత మంచి కంపెనీకి చెందిన బాడీస్ప్రే వాడాలి. ఎవరికైతే తమ చెమటలోంచి భరించలేనంత వాసన వస్తుందో వారు బాత్ సాల్ట్ నీటిలో కలిపి స్నానం చేయాలి. సువాసనను వెదజల్లే పౌడరు వాడాలి.
*స్నానం చేసిన తర్వాత ధరించే బట్టలపై నాణ్యమైన పెర్‌ఫ్యూమ్ వాడాలి. ఆ పర్‌ఫ్యూమ్ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.
*ఎండాకాలంలో కాటన్ దస్తులనే వాడాలి. అది కూడా పల్చటి బట్టలనే వాడాలి. సింథటిక్ బట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇవి చెమటను మరింత ఎక్కువగా వచ్చేలా చేస్తాయి.
*ఇంట్లో ఉన్న వారు ఎక్కువగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాల్లో ఉండాలి. తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి.
*చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకొని శరీరానికి పూసి స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -