జియే దెబ్బకు ఏయిర్టెల్ దిగి వచ్చింది. తమ ఖాతాదారులకు ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోసి సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. కొత్తగా మై హోం పథకంలో మరో బంపర్ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది.
ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఆఫర్ ప్రకారం ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది.ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది.
{loadmodule mod_sp_social,Follow Us}
