Sunday, April 28, 2024
- Advertisement -

పార్టీలో ఈవివ‌క్ష ఏంటి బాబు….

- Advertisement -
Chandrababu Naidu suspends MLC Vakati Narayana Reddy from TDP

క్ర‌మ శిక్ష‌ణ‌కు మారు పేరైన టీడీపీ ఇప్పుడు క్ర‌మ‌శిక్ష‌ణా త‌ప్పుతోందా..? అందుకు ప‌రిస్థిత‌లు అలానే ఉన్నాయి. పార్టీలో ఎవ‌రు త‌ప్పుచేసినా స‌హించేదిలేద‌ని బాబు చెప్పిన మాట‌లు ఇప్పుడు నీటిమీద బుడ‌గ‌లాగ తేలిపోయాయి.దీనికి నిద‌ర్శ‌న‌మే ఆపార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ రెడ్డి పార్టీ నుంచి స‌స్పెండ్ .

బ్యాంకులను ముంచిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై బాబు స‌స్పెండ్ చేశారు. . తప్పుడు పత్రాలతో బ్యాంకు నుంచి 450 కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో శుక్రవారం వాకాటి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ మెరుపుదాడులు నిర్వహించింది.కేసులు నమోదు చేసింది. ఈనేపథ్యంలో వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. నిజానికి వాకాటి బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారం ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే వెలుగులోకి వచ్చింది. అప్పటికే కేసులు నమోదు అయ్యాయి. అయినా నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టేందుకు వాకాటినారాయణరెడ్డిని చంద్రబాబు వాడుకున్నారు, బరిలో దింపారు. భారీగా ఖర్చు పెట్టి ఆయన విజయం సాధించారు.
ఇదంతా బాగానే ఉంది స‌రే. పార్టీలో మిగిలిన వారి ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.పార్టీకి చెడ్డ‌పేరు రాకుండా ఉండేదుకే బాబు వేటు వేశారు. మ‌రి టీడీపీలో ఇలా బ్యాంకుల‌కు టోపి పెట్టిన వారు చాలామంది ఉన్నారు.వాళ్ల‌ను బాబు స‌స్పెండ్ చేస్తారా …అంత ధైర్యం ఉందా బాబుకు అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

బ్యాంకుల‌కు కుచ్చుటోపి పెట్టిన మ‌రో కేంద్రమంత్రి సుజనా చౌదరి . ఈయ‌న కూడా వందల కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించలేదు. దీనిపై కేసు కూడా నడుస్తోంది.ఈయ‌న కేంద్ర‌మంత్రిగా కొన‌సాగుతున్నారు.మ‌రి బాబు వీరి మీద ఎందుకు వేటువేయ‌లేదా…..అంత స‌హాసం చేస్తారా బాబు గారు.
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మ‌హానుభావుడు.ఈయ‌న ఏకంగా ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలతో తాకట్టు పెట్టి ఏకంగా 141 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన ఘ‌నుడు. దీంతో ఆయన ఆస్తులను కూడా బ్యాంకులు జప్తు చేశాయి.ఈయ‌నేమో ద‌ర్జాగా మంత్రిగా చెలాయిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్‌ కూడా బ్యాంకులకు అప్పులు చెల్లించని జాబితాలో ఉంది. అయినా సరే సుజనా చౌదరిపై గానీ, రాయపాటిపై గానీ, గంటా శ్రీనివాసరావుపై గానీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాకాటి నారాయణరెడ్డిపై మాత్రం వెంటనే వేటేశారు. వీల్ల‌కోనీతి…..వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి మ‌రో నీతి ఈ వివ‌క్ష ఏంటో చంద్ర‌బాబుకే తెలియాలి.వారిమీద బేటు వేస్తే బాబు ప‌ని ఖేల్ ఖ‌తమే.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -