“వ్యూహం”లో జగన్, భారతీ బెడ్ రూమ్ సీన్‌ చూపించిన వర్మ

Netizens fire on ram gopal varma jagan biopic photos
Netizens fire on ram gopal varma jagan biopic photos

వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. గతంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై సైటిరికల్‌గా సినిమాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఆ మధ్య జగన్ బయోపిక్ కూడా సినిమాగా తెరకెక్కిస్తానని చెప్పి షాకిచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైసీపీకి అనుకులంగా మాట్లాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా జగన్ బయోపిక్‌ను “వ్యూహం” అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో జగన్ భార్య భారతీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ ఫొటోల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి నటిస్తోంది.”వ్యూహం” బయోపిక్ కాదని, బయోపిక్‌ను మించిన రియల్ పిక్ అని ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమాలో చూపించేవన్నీ నిజాలే ఉంటాయని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. అయితే వర్మ రివిల్ చేసిన ఫొటోస్‌లో వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్ సీన్ ఫోటో షేర్ చేయడంతో రకరకాల కామెంట్లు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లపై రామ్ గోపాల్ వర్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యూహం అలాంటి సినిమా కాదు అంటూ వర్మ ట్వీట్ చేశారు.