Monday, April 29, 2024
- Advertisement -

హీరోతో యాంకర్ విష్ణు ప్రియ ప్రేమాయణం..పెళ్లి కూడా అంటూ షాకిచ్చింది

- Advertisement -

ఇటీవల కాలంలో యాంకర్స్ కూడా హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. తమ గ్లామర్ షోతో టీవీ షోలకు మంచి రేటింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. సుమను పక్కన పెడితే.. శ్రీముఖి, వర్షిణి, అనసూయ, విష్ణు ప్రియ వీరంతా తమ గ్లామర్‌తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. అతి తక్కువ కాలంలోనే యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. ముఖ్యంగా ‘ పోవే పోరా’ అనే ఒక్క షోతోనే స్టార్ యాంకర్ జాబితాలో చేరిపోయింది. ‘పోవే పోరా’ షోతో విష్ణు ప్రియకు మంచి గుర్తింపు లభించింది. తద్వారా పలు షోలలో యాంకరింగ్ చూస్తూనే , వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటేస్ట్ ఫొటోలను . ఎప్పటికప్పుడూ అభిమానుల కోసం సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తోంటుంది.

ఇటీవలే షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది.తాను ఓ సీనియర్ హీరోను ప్రేమిస్తున్నానని చెప్పి షాకిచ్చింది. ఆ హీరోకు నాకు మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని తెలిపింది. అయిన తనకు ఆయన అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా ఆ సీనియర్ హీరో అని ప్రశ్నించగా..సీనియర్ హీరో జేడీ చక్రవర్తి అని చెప్పి ప్రేక్షకులకు షాకిచ్చింది. తన ప్రేమను జేడీకి తెలియజేశానని.. ఆయన ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపింది.

ఆంటీ ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు. ఈ ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని అభిప్రాయాన్ని వెల్లడించింది. ఒక వెబ్ సిరీస్ కోసం 45 రోజులు మంగళూరులో ఆయనతో కలిసి జర్నీ చేశాను. ఆ జర్నీలో పదవ రోజే ఆయనతో నేను ప్రేమలో పడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే జేడీ చక్రవర్తికి 53 ఏళ్లు. ఆయన చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్ నడిపారనే రూమార్స్ కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ప్రేమించడం ఉంటని విష్ణు ప్రియను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి విష్ణు ప్రియ ప్రేమను జేడీ చక్రవర్తి అంగీకరిస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -