దర్శకుడు శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడంటే..?

Director Shankar is keen to work with Pawan Kalyan
Director Shankar is keen to work with Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలన్నింటి షూటింగ్ పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ కానున్నాట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ మరో సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని, పవర్ స్టార్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. వచ్చే ఎన్నికల తర్వాత ఈ సినిమా చేయనున్నాడని సమాచారం. అమద్య దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌ని డైరెక్టర్ శంకర్ మొదట అనుకున్నది పవన్ కళ్యాణ్ నే.. కాని నేను రామ్ చరణ్‌ సూచించాను అని అన్నాడు. తాను స్క్రిప్ట్ వింటున్న సమయంలో, రామ్ చరణ్ RRR షూటింగ్‌లో ఉన్నాడని మరియు శంకర్ కథ వినమని చరణ్‌ను పట్టుబట్టాడని కూడా అతను చెప్పాడు.

సౌత్ ఇండియన్ సినిమాల్లోనే ఒక పెద్ద డైరెక్టర్ తమ అభిమాన హీరోతో సినిమా చేయనున్నట్టు తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం తో ఉర్రూతలూగుతున్నారు. అయితే ఈసారైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు శంకర్ ల క్రేజీస్ట్ కాంబినేషన్ కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం.