గుంటూరు కారం: శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్

Sreeleela first look poster from Guntur Kaaram Movie
Sreeleela first look poster from Guntur Kaaram Movie

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా గ్లింప్స్ లో మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. మాస్ లూక్ లో అభిమానులలో క్రేజ్ పెంచారు. ఇప్పు ఈసినిమా నుంచి మరో అఫ్ డేట్ వచ్చింది.

ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల సంప్రదాయబద్ధంగా, పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది. ఈ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. శ్రీలీల ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులు, నెటిజన్లు శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గుంటూరు కారం కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నారు . చిన కథానాయిక. థమన్ ఎస్ ఈ చిత్రానికి స్వరకర్త, జనవరి 13, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.