రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ షూటింగ్‍కి బిగ్ బ్రేక్..

A big shooting break for Ram Charan’s Game Changer
A big shooting break for Ram Charan’s Game Changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ఆలస్యం అవ్వుతున్న ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది, కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ కావడంతో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఈ సినిమా షూటింగ్ చాలా స్లో గా సాగుతోంది. మనకందుతున్న సమాచారం ప్రకారం, ఇంకా చాలా షూటింగ్ పార్ట్ పెండింగ్‌లో ఉందని తెలిస్తుంది.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ తన మొదటి బిడ్డను స్వాగతించడానికి గేమ్ ఛేంజర్ షూటింగ్ నుండి పెద్ద విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విరామం దాదాపు 3 నెలలు ఉండవచ్చు. ఈ సినిమాను 2024 సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

గేమ్ ఛేంజర్‌లో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అకా SVC పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించారు. మ్యూజిక్ ఎస్ థమన్, కార్తీక్ సుబ్బరాజు రాసిన కథను సాయి మాధవ్ బుర్రా తీర్చిదిద్దగా, రత్నవేలు సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు.