డ్రగ్స్ ఆరోపణలపై సురేఖా వాణి రియాక్షన్

Surekha Vani Reaction on drug allegations
Surekha Vani Reaction on drug allegations

కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ కేసులో ‘కబాలి’ తెలుగు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేపీ చౌదరి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాట్‌ల ఆధారంగా ఈ కేసుతో సంబంధం ఉన్న చాలా మంది నటీమణుల పేర్లను వెల్లడించాయి.

బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి, నటి సురేఖా వాణి మరియు జ్యోతి ఫోన్ నంబర్ అతని కాల్ లిస్ట్ మరియు వాట్సాప్‌లో కనుగొనబడ్డాయి. అయితే సురేఖా వాణి, కేపీ చౌదరి బుగ్గపై ముద్దుపెట్టుకున్న ఫోటో వైరల్ కావడంతో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. మత్తులో ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లు పై సురేఖా వాణి సోషల్ మీడియాలో ద్వారా స్పందించింది. తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని… తనపై డ్రగ్స్ ఆరోపణలను ఆపాలని మీడియాను అభ్యర్థించింది.

“ఈ ఆరోపణలు నా భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. నా పిల్లల భవిష్యత్తు, నా కుటుంబం పరువు పోతుంది. దానితో నాకు సంబంధం లేదు. పుకార్లు ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’ అని సురేఖా వాణి వీడియోలో పేర్కొన్నారు.