Monday, April 29, 2024
- Advertisement -

రీలీజ్‍కి ముందే ’సాలార’ ఆల్ టైమ్ రికార్డ్..!

- Advertisement -

పాన్ ఇండియన్ స్ఠార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా తర్వాత వస్తున్న అతిపెద్ద చిత్రం సాలార్. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అటు ప్రేక్షకుల్లో, ఇటు ట్రేడ్‌ వర్గాల్లో భారీ హైప్‌ నెలకొంది. అయితే ఈ సినిమా బిజినెస్ పై ఓ చర్చ జరుగుతుంది. సాలార్ ఇండియన్ సినిమాకి ఆల్ టైమ్ రికార్డ్ థియేట్రికల్ బిజినెస్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పట్టి వరకు RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల కంటే ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ చేసి రికార్డ్ సృష్టించి ఉంది. అయితే ఇప్పుడు సాలార్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను క్రాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. బాహుబలి సిరీస్ హీరో మరియు కెజిఎఫ్ సిరీస్ డైరెక్టర్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సాలార్ ఇప్పటికే భారీ బజ్ తీసుకువెళుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఓవర్సీస్‌లో 80 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రేషియోతో బిజినెస్ జరుగుతోందని సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, ఉత్తర భారతం మరియు భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉంది. కాబట్టి, ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో RRR రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది మరియు భారతీయ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌ను సృష్టించే అవకాశం ఉంది.

మనకున్న సమాచారం ప్రకారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాలార్ టీజర్ జూలై 1 వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. సాలార్‌లో ప్రధాన పాత్రలో ప్రభాస్ తో పాటు వర్ధరాజ మన్నార్ క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శృతి హాసన్, మీనాక్షి చౌదరి మరియు శ్రీయా రెడ్డి ఇతర ప్రముఖ పాత్రల్లో నటింస్తున్నారు.

Also Read: నాగ చైతన్యకి జోడిగా కీర్తి సురేష్…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -