పుష్ప 2లో భారీ ఇంట్రో యాక్షన్ ఎపిసోడ్..

Massive intro action episode for Allu Arjun in Pushpa 2
Massive intro action episode for Allu Arjun in Pushpa 2

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ” పుష్ప పార్ట్ 2 ”. మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేయడంతో రెండవ భాగంపై విమరితమైన బజ్ ఏర్పడింది. దాంతో ఎక్కడ కంప్రమైజ్ కాకుండా పుష్ప-2 సినిమాని రూపొందిస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండటంతో యావత్ భారతీయ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్‌ ఇంట్రో యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు అర్జున్ ఇంట్రో యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇంట్రో యాక్షన్ ఎపిసోడ్‍ను చిత్ర బృందం 100% ఎఫర్ట్ పెట్టి చాలా గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారట. ఈ ఎపిసోడ్‌ని పూర్తి చేయడానికి
ఒకటిన్నర నెలలు పట్టిందని… ఎక్కడ రాజీపడకుండా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. వచ్చిన అవుట్‌పుట్‌తో టీమ్ మొత్తం సంతోషంగా ఉన్నారట.

మొదటి భాగం కొనసాగింపుగా పుష్ప 2లో రష్మిక మందన్న మరియు ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తో పాటు కొత్తగా జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ మోస్ట్ హైప్ సీక్వెల్‌ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.