Sunday, April 28, 2024
- Advertisement -

సోలోగా ఎన్టీఆర్‌ ’దేవర’… బిగ్గెస్ట్ హిట్ ఖాయం..

- Advertisement -

ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ’దేవర’ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ రివీల్‌తో అంచనా స్థాయిని పెంచేసారు మేకర్స్. టైటిల్‌తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవర సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

2024 సమ్మర్‍లో సోలోగా బరిలో దిగనున్న ఎన్టీఆర్‌ ’దేవర’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడం దాదాపు ఖాయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇతర స్టార్ హీరోల చిత్రాల పురోగతిని చూస్తుంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నందున OG ఈ డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉండగా, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి ఇతర స్టార్ హీరోలు ఇప్పటికే సమ్మర్ రేసు నుండి నిష్క్రమించారు. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K 2024 దసరా సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 5న సోలోగా విడుదల కానున్న ఎన్టీఆర్ ’దేవర’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయంగా. ఇక ఏప్రిల్‍లో ఎక్కువ పండుగ సెలవులు మరియు వేసవి ప్రయోజనాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారి కలెక్షన్లు రాబట్టేందుకు చాలా అవకాశం ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -