ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ గురించిన ప్రస్తావనే జరుగుతోంది. జగన్ సర్కార్ తనను కుట్రలతో అరెస్ట్ చేయాలని చూస్తోందని..తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేదని సింపతి వర్కవుట్ అయ్యేలా మాట్లాడారు చంద్రబాబు.అంతేగాదు తనను అరెస్ట్ కూడా చేస్తారని వెల్లడించారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ సానుభూతి రాజకీయం ఫలిస్తుందా అంటే కష్టమేనని చెప్పాలి.
ఎందుకంటే గతంలో అలిపిరి సంఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అలిపిరి బాంబు పేలుళ్లు అందులో నుండి బాబు సరక్షితంగా బయటపడ్డారు. అంతే ఈ సెంటిమెంట్‌ని వాడుకుని ఎన్నికల్లో గెలిచేందుకు ముందుస్తుకు వెళ్లినా బాబు వేసిన ఎత్తుగడ బుమారాంగ్ అయింది. దీంతో ప్రజాక్షేత్రంలో బాబు ఓడిపోకతప్పలేదు.
తాజాగా అలాంటి సెంటిమెంట్‌నే పండించి సింపతితో గెలవాలని చంద్రబాబు మరోసారి రాజకీయ ఎత్తుగడ వేశారు. అయితే ఇది ఏ మేరకు ఫలిస్తుందనేది ప్రశ్నే. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు జగన్‌కే అనుకూలంగా ఉన్నాయి. క్షేత్రస్ధాయిలో అంత వ్యతిరేకత లేదు. జగన్‌పై వ్యతిరేకత సంగతి పక్కన పెడితే చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. దీంతో అరెస్ట్ పేరుతో బాబు సెంటిమెంట్ పండించాలని చూస్తే అది మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాబు అవినీతి,అరెస్ట్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.