రాజకీయాలంటే స్పష్టమైన వైఖరి ఉండాలి…ఒకసారి ఓ స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి..?అదే ప్రజల్లో, ఆ పార్టీ కార్యకర్తల్లో నాయకుడి ఇమేజ్ పెంచుతుంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరుగుతోంది…?ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ రోజుకో మాట ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు ఇదే జనసైనికులనే వేధిస్తున్న ప్రశ్న.
2019 ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు పవన్. దీంతో పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. అయితే తర్వాత బీజేపీ కూటమిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు వెళ్తామని పలుమార్లు ప్రకటించారు. అయితే ఇద్దరు కలిసి ఎక్కడ పోరాటం చేయకపోయినా ఎన్డీయే కూటమిలోనే ఉన్నారు పవన్. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా మైండ్ సెట్ మారిపోయింది. ఎవరిని సంప్రదించకుండానే టీడీపీతో పొత్తును ప్రకటించారు. తర్వాత ఓ సారి ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చానని తిరిగి తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని వ్యాఖ్యానించి పొలిటికల్ కమెడీయన్‌గా మారిపోయారు. అయితే పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ఇఏ ఏపీలో ఈ పొత్తుల సంగతి ఇలా ఉంచితే తెలంగాణలో జనసేన మద్దతు కోరారు టీబీజేపీ నేతలు. పవన్‌ని కలిసి బీజేపీకి మద్దతివ్వాలని, జనసేన అభ్యర్థులను బరిలో నింపవద్దని కోరారు. అయితే అప్పటికే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతలకు పవన్ ఎందుకు చెప్పలేకపోయారన్నదే ప్రశ్న. ఇది ఇలా ఉంచితే ఏపీలో టీడీపీతో పొత్తుకు తహతహలాడిన పవన్…తెలంగాణలో మాత్రం టీడీపీతో పొత్తుపై కనీసం మాట కూడా మాట్లాడటం లేదు. దీంతో పవన్ బ్రోకి ఏమైంది అంటూ జనసైనికులే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజై రోజులు వారాలు గడుస్తున్నా.. పవన్ మౌనంగా ఉండడం వెనుక అంతర్యమేంటో ఆయనకైనా తెలుసా అన్న సందేహం వ్యక్తమవుతోంది.