కస్టడీ తర్వాత చందుమొండేటితో నాగచైతన్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.చైతూ కెరీర్లో ఇది 23వ సినిమా కాగా గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి న సవ్యసాచి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్టును చందు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ – గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా వస్తుండగా ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
ఇక ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు చైతూ. ఇందుకు సంబంధించిన వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా చైతూ పడుతున్న కష్టం చూసి సినిమా హిట్ అవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. గతంతో పోలిస్తే రఫ్ లుక్‌లో చైతన్య కనిపిస్తుండగా మజిల్స్ పవర్ ని అమాంతం పెంచేశాడు. గుబురు గడ్డం కోరమీసంతో ఉన్న చైతూ బీస్ట్ మోడ్‌లోకి మారాడని తెలిపారు దర్శకుడు. చైతన్య హార్డ్ వర్క్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
YUVASAMRAT on BEAST MODE 💪🔥🔥🔥@chay_akkineni #NagaChaitanya #NC23 pic.twitter.com/pnsCUMkM64
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 5, 2023