Sunday, May 5, 2024
- Advertisement -

అంతర్మథనం..ఉమ్మడి మేనిఫెస్టోనా..ఎవరికి వారేనా?

- Advertisement -

టీడీపీ చీఫ్ చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉండగా తాను బయట ఉండగానే అన్ని అంశాలను చక్కదిద్దే పనిని భుజాన వేసుకున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా పార్టీ శ్రేణులను కలుస్తూ వారికి హితబోధ చేస్తున్న బాబు…పనిలో పనిగా జనసేకు కేటాయించే సీట్లు, స్థానాలను తేల్చేయాలని భావిస్తున్నారు. దాదాపు ఇప్పటికే జనసేన సీట్లు, స్థానాలు ఫైనల్ కాగా తాజాగా మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉన్నారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోనా లేదా ఎవరికి వారే మేనిఫెస్టో విడుదల చేయాలా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక చంద్రబాబుతో దాదాపు 2 గంటల భేటీలో కీల అంశాలపై చర్చించగా మేనిఫెస్టో అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటే ఏఏ అంశాలనే ప్రస్తావించాలని అన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ప్రధానంగా అమరావతిని రాజధానిగా కొనసాగించడం, విశాఖ, తిరుపతి, విజయవాడలను మహానగరాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సంపన్న ఏపీ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమం, నీటి పారుదల,ఉద్యోగాల కల్పన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మేనిఫెస్టోలో రైతలుకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత లాంటి ఐదు అంశాలు హైలైట్‌గా మేనిఫెస్టో ఉండనుందని సమాచారం. మరి టీడీపీ – జనసేన నేతలు తీర్చిదిద్దుతున్న ఈ మేనిఫెస్టో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -