తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సారి ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు పలు నియోజకవర్గాల్లో కీలకం కానుండగా వీరంతా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సీమాంధ్రులు ఇటు తెలంఆణలో అటు ఏపీలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు.
ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు ఏపీ మంత్రులు. ఇవాళ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున కలవనున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, పలుప్రాంతాల్లో ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి కౌంటర్‌గా రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న వారిని తొలగించాలని విజ్ఞప్తి చేయనున్నారు మంత్రులు.
రాష్ట్రంలో నమోదయిన నకిలీ ఓట్లను తొలగించాలని ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా ఓటర్ల నమోదులో తామేమీ అక్రమాలకు పాల్పడలేదని వైసీపీ చెప్పకనే చెప్పినట్లు అవుతుందని భావిస్తోంది. ఇదే సమయంలో సెటిలర్ల ఓట్లకు చెక్ పెట్టవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారికి ఎక్కడో ఒకచోటే ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం ద్వారా కొంత ప్లస్ అవుతుందని వైసీపీ భావిస్తోంది. మరి వైసీపీ నేతల ఫిర్యాదుతో రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారికి చెక్ పడుతుందా లేదా వేచిచూడాలి..